ప్రొ. కోదండరాం మేధస్సుకు సర్కారు గౌరవం
– ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం హర్షణీయం
– టీజేఎస్ తాండూరు ఇంచార్జ్ సోమశేఖర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఉద్యమ కారులు, తెలంగాణ జన సమితి నాయకులు ప్రొఫెసర్ కోదండరాంకు తెలంగాణ సర్కారు ఎమ్మెల్సీ పదవి అందించి గౌరవించడం అభినందనీయమని టీజేఎస్ తాండూరు ఇంచార్జ్, మున్సిపల్ కౌన్సిలర్ సాంబూరు సోమశేఖర్ అన్నారు. గురువారం ప్రొఫెసర్ కోదండరాంకు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేయడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పౌర సమాజం కోసం ఫ్రోపెసర్ కోదండరాం పోరాటం చేశారని అన్నారు. తెలంగాణ వచ్చాక ఏనాడు పదవుల కోసం పాకులాడలేదన్నారు. అలాంటి ఆలోచన ఉంటే ఉన్నత పదవిలో ఉండేవారన్నారు.
ఈ పదేండ్లలో ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చేందుకు పాలకులపై ఒత్తిడి తెచ్చారని అన్నారు. నిరంతరం ప్రజల పక్షాన పోరాడిన మహనీయుడుగా కోదండరాంను అభివర్ణించారు. చట్ట సభల్లో ఉంటే ఆయన సేవలు, మేధస్సు సమర్థవంత పాలనకు ఉపయోగపడాతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పదవితో ప్రొఫెసర్ కోదండరాంను గౌరవించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదికూడా చదవండి…

