
అధ్యాపకుల చేతిలో భవిష్యత్తు..!
– పీపుల్స్ కాలేజీ కరస్పాండెంట్ ఉత్తమ్ చంద్
– ప్రిన్సిపల్, అధ్యాపకులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అధ్యాపకుల చేతిలోనే యువత భవిష్యత్తు ఉంటుందని తాండూరు పీపుల్స్ డిగ్రీ కాలేజీ కార్యదర్శి, కరస్పాండెంట్ ఉత్తమ్ చంద్ అన్నారు. శనివారం కాలేజీలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నారు.

కరస్పాండెంట్ ఉత్తమ్ చంద్ ఆధ్వర్యంలో కాలేజీలోని అధ్యాపకులకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సభ్యులు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని అన్నారు.

విద్యార్థులను, యువతను ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యత అధ్యాపకులపై ఉందని అన్నారు. యువతను, వి ద్యార్థులను ఎలా కావాలిస్తే అలా మలిచే శక్తి ఉపాధ్యాయులు, అధ్యాపకులపై ఉంటుందని అన్నారు. అందుకే వారిలో ఉత్తమ భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ పి.చంద్రకళ, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

