రేపటి నుంచి దసరా సెలవులు
దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని బడు లకు రేపటి నుంచి దసరా సెలవులను ప్రకటించింది విద్యాశాఖ. ఈమేరకు రేపటినుంచి ఈనెల17 వర కు దసరా సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల18న పునఃప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా జూనియర్ కాలేజీలకు ఈనెల 13నుంచి18వరకు దసరా సెలవులు ప్రకటించారు. దసరా సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించ వద్దని అన్ని జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్1నుంచి ప్రత్యక్ష బోధన మొదలైంది. అటు,భారీ వర్షా లవల్ల పలుజిల్లాల్లో తక్కువ రోజులే తరగతులు జరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన విద్యాసంస్థలు దాదాపు 18 నెలల తర్వాత తిరిగి తెరుచుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్ సమయంలో అంతా ఆన్‌లైన్‌కే పరిమితం కాగా.. ఈ మధ్యే భౌతికతరగతులు ప్రారంభం అయిన విషయం విదితమే.

