తాండూరు నియోజకవర్గానికి నిధుల వరధ

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు నియోజకవర్గానికి నిధుల వరధ
– ఐదు మండలాలకు రూ. 13 కోట్లు మంజూరు
– ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గానికి నిధులు వరధ పారిస్తున్నారు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కల ద్వారా రూ. 100 కోట్లు మంజూరుకు మనోహర్ రెడ్డి కృషి చేశారు. తాజాగా తాండూరు నియోజకవర్గానికి రూ. 13 కోట్ల నిధులు మంజూరైనట్లు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ ఉపాధి హామి పథకం కింద ఈ నిధులు మంజూరైనట్లు స్పష్టం చేశారు.

నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలకు ప్రతి మండాలనికి రూ.3 కోట్ల చొప్పున 12 కోట్లు మంజూరు కాగ కోట్ పల్లి మండలానికి రూ. 1కోటి మంజూరు కావడం జరిగిందని వివరించారు. మండలాల్లోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇటీవలే కొలువుదీరిన ప్రత్యేకాధికారుల ద్వారా పనులను గుర్తించి తీర్మానం చేయించడం జరుగుతుందని, అనంతరం పనులను ప్రారంభించడం జరుగుతుందన్నారు. మరోవైపు అభివృద్ధి పనులకు సంబంధించి ఆయా గ్రామాల్లో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పర్యటించి నివేధికలు తయారు చేసేలా చూడాలని కోరడం జరిగిందన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!