ప్రజా ఆరోగ్య శ్రేయస్సే సర్కారు లక్ష్యం
– వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: పేద ప్రజల ఆరోగ్య శ్రేయస్సే తెలంగాణ సర్కారు లక్ష్యమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ధారూర్ మండలంకు చెందిన సీఎం సహాయ నిధి లబ్దిదారులకు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, బడగు వర్గాల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా చేయూతనందిస్తోందన్నారు. అనారోగ్యంతో బాధపడే పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చులను అందిస్తూ అందరికి అండగా నిలుస్తోందన్నారు. అనారోగ్యానికి గురైన పేదలు సీఎం సహాయనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


