గణేష్ నిమజ్జనం ప్లేస్ ఫిక్స్..!
– ఈసారి కూడా కోకట్ కాగ్నానే
– నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
– కోకట్ వాగును పరిశీలించిన అధికారులు, నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని వినాయక నిమజ్జనానికి ప్లేస్‌ను ఫిక్స్ చేశారు. ఈ యేడాది కూడా కోకట్ కాగ్నా వాగులో వినాయకుల నిమజ్జనం చేయాలని.. నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు, డీఎస్పీ శేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలులు కోకట్ కాగ్నా వాగును సందర్శించారు. స్థానిక సర్పంచ్, గ్రామస్తులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లపై చర్చించారు. అయితే కోకట్ కాగ్నపై రోడ్డు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేశారు. వెంటనే నేతలు, అధికారులు విషయాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందించి రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. దీంతో పాటు విద్యుత్ సమస్యను కూడా తీర్చాలని కోరారు.
హిందూ ఉత్సవ సమితి సభ్యులు కూడా కోకట్ కాగ్నాకు కోట్ పల్లి నుంచి నీరును వదలేలా చూడాలని కోరారు. అనంతరం మున్సిపల్, పోలీసు, విద్యుత్, రెవెన్యూ అధికారులు ఆయా శాఖల నుంచి తీసుకునే చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక నిమజ్జనంకు వచ్చే గణేషులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, మున్సిపల్ కమీషనర్ షఫీవుల్లా, డీఈ ఖాజా, సీఐలు రాజేందర్ రెడ్డి, రాంబాబు, గ్రామస్తులు, సమితి సభ్యులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

