23వరకు కవితకు కస్టడీ..!

జాతీయం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

23వరకు కవితకు కస్టడీ..!
– సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు
– అదుపులోకి తీసుకున్న ఈడీ
దర్శిని డెస్క్ : తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈనెల 23వరకు కస్టడీ విధిస్తున్నట్లు ఢిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను శుక్రవారం ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు అదేరాత్రి ఢిల్లీకి తరలించారు. శనివారం ఉదయం ఈడీ అధికారులు కవితను సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు.

ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి వాదనలు వినిపించగా.. ఈడీ తరఫున ఎన్‌.కె మట్టా, జోయబ్‌ హుసేన్‌ వాదించారు. సుదీర్ఘ వాదనల తర్వాత మార్చి 23 వరకు కవితను ఈడీ కస్టడీకి అనుమతిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 23న తిరిగి కోర్టులో హాజరు పర్చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతి రోజు కుటుంబ సభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు, ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించింది.

లోకల్ యాడ్…

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!