పార్లమెంట్‌కు సిద్దం కండి..!
– పారదర్శంగా ఎన్నికల నిర్వహణ
– విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
– శిక్షణ సమావేశంలో తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు, సిబ్బంది సంసిద్దంగా ఉండాలని తాండూరు ఆర్డీఓ, సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రావు అన్నారు. బుధవారం తాండూరు పట్టణం ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గోనే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో పాల్గొనే అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. పారదర్శకంగా పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా ముగించేలా పనిచేయాలన్నారు.
ఏమైనా సందేహాలు ఉంటే శిక్షణ నిపుణుల వద్ద నివృత్తి చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా శిక్షణ కార్యక్రమానికి 300ల మంది అధికారులు హాజరు కావాల్సి ఉండగా 257 మంది మాత్రమే హాజరు కావడంతో నేటి శిక్షణ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు తారాసింగ్, కిషన్, వెంకటేష్, మునీరుద్దీన్, రేవెన్యూ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

