తాండూరు పట్టణ వాసులకు శుభవార్త
– ఆస్తిపన్నులు మొత్తం చెల్లిస్తే రాయితీ
– ప్రకటించిన మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహా రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ వాసులకు మున్సిపల్ అధికారులు శుభవార్త చెప్పారు. వార్షిక ఆస్తిపన్నులు మొత్తం చెల్లిస్తే రాయితీ అందిస్తామని కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నుల్లో రాయితీ అందించేందుకు ప్రభుత్వం ఎర్లీబర్డ్ స్కీం ప్రవేశ పెట్టిందన్నారు. ఈ స్కీం కింద మొత్తం వార్షిక పన్నులు చెల్లించిన 5 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.
అర్హులైన ఆస్తి పన్ను దారులు రాయితీని పొందాలని, ఈనెలాఖరులోగా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా గత వార్షిక సంవత్సరానికి సంబంధించి 8కోట్ల 66 లక్షల లక్ష్యంలో ఇప్పటి వరకు రూ.4 కోట్ల 50 వరకు వసూలు చేయడం జరిగిందన్నారు. అయితే మున్సిపల్ పరిధిలో డబుల్ అసెస్ మెంట్ లు ఉండడంతో టార్గెట్ పెరిగిందని, దానిని సవరించి నిర్థిష్టమైన లక్ష్యాన్ని నిర్ణయిస్తామన్నారు.
దీంతో పాటు పన్నుల విషయంలో, అసెస్ మెంట్లో ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకరావాలని సూచించారు. వారం, పది రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు ట్రేడ్ లైసెన్స్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
ఇదికూడా చదవండి…

