కమలం గెలుపుకు కసిగా పనిచేయండి
– 225 గంటల్లో గెలుపు మహాయజ్ఞాన్ని పూర్తి
– గెలిచాక ప్రతి కార్యకర్తకు తోడుంటా
– తాండూరులో బీజేపీకి అగ్రపీఠం
– మందు, బిర్యాని పంపిణీలే హస్తం ఎజెండా
– చేవేళ్ల ఎంపీ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
– బీజేపీలో చేరిన ఇతర పార్టీల నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో అందరు కమలం గుర్తుకు ఓటేసేలా అందరు కసిగా పనిచేయాలని చేవేళ్ల పార్లమెంట్ మాజీ సభ్యులు, పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం ఎంపీటీ హాల్లో బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరై నేతలు, కార్యకర్తలకు బీజేపీ గెలుపుపై దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 20రోజులే ఉన్నాయని, ప్రతి బూత్ కార్యకర్త పార్టీ గెలుపులో కీలకంగా పనిచేయాలన్నారు.
పరీక్షలు రాసే విద్యార్థుల మాదిరిగా పార్టీ గెలుపుకోసం సిద్ధం కావాలన్నారు. 225 గంటల్లో ప్రతి గడపు తట్టి సైనికుల్లా పనిచేయాలన్నారు. తాండూరులో బీజేపీ టాప్ ప్లేస్ లో ఉందన్నారు. ప్రధాని మోడి వల్ల బీజేపీ గెలుపు సుసాధ్యం అవుతుందన్నారు. మందు, బిర్యాణీలు పంపిణీ ఎజెండాగా కాంగ్రెస్ పనిచేస్తుందని దుయ్యబట్టారు. కావాలనే బీజేపీపై దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. సాధ్యం కానీ హామీలతో ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ప్రతి కార్యకర్తకు చెందాలన్నారు. గెలిచిన తరువాత ప్రతి కార్యకర్తకు తోడుంటానని అన్నారు.
బీజేపీలోకి మైనార్టీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు
మరోవైపు బీజేపీ, మోడి ప్రవేశ పెట్టిన పథకాలకు ఆకర్షితులై పలువురు బీజేపీ పార్టీలో చేరాడు. ఇందులో మైనార్టీ నాయకులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు ఉన్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి దాదాపు 200ల మందికి కమలం కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో తెలంగాణ ఉద్యమకారుడు. మాజీ కౌన్సిలర్ ముజీబ్, జీవన్గీ మాజీ ఎంపీటీసీ మల్లికార్జున్, మంతట్టి మాజీ సర్పంచ్ దశరథ్, గుండ్లమడుగు తాండా మాజీ సర్పంచ్ జాదవ్, దశరథ్, కాశింపూర్ మాజీ సర్పంచ్ వెంకటయ్య, పర్వత్ పల్లి మాజీ సర్పంచ్ భర్త చాంద్ పాషతో పాటు పలువురు పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగారం నర్సింలు, మనోహర్ రావు, బాలి శికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, ఎంపీపీ బాలేశ్వర్ గుప్త. మాజీ కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, నాయకలు గాజుల శాంతుకుమార్, పటేల్ విజయ్ కుమార్, ఎంపీటీసీ పొయిరెడ్డి. బీరప్ప, బొప్పి శ్రీహరి, జిల్లా అధికారి ప్రతినిధి జుంటుపల్లి వెంకట్, వివిధ గ్రామాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

