లక్ష మందితో కాంగ్రెస్ బహిరంగ సభ

తాండూరు రాజకీయం వికారాబాద్

లక్ష మందితో కాంగ్రెస్ బహిరంగ సభ
– హాజరు కానున్న ప్రియాంక గాంధీ
– పాల్గొంటున్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రముఖులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడును పెంచింది. ఇందులో భాగంగా ఈనెల 6న తాండూరులో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం తాండూరు పట్టణం విలియమూన్ గ్రౌండ్ లో సభ స్థలం ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 6న తాండూరులో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శురాలు ప్రియాంక గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు పాల్గొంటున్నారని తెలిపారు.

వారితో పాటు జాతీయ నాయకురాలు దీపాదాస్ మున్షి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. పట్టణంలోని విలియమూన్ మైదానంలో ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే సభకు నియోజకవర్గ వ్యాప్తంగా లక్ష మంది జన సమీకరణ చేస్తామన్నారు. అదేవిధంగా ఎన్నికల్లో రంజిత్ రెడ్డితో పాటు 14 పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తాండూరు సెగ్మెంట్ ఇంచార్జ్ మహేష్ కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాస్ చారి, సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, మురళీకృష్ణగౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మసూద్, సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, రవి, రాము తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

కమలంతో కలిసి రండి..!