బీసీల దోస్త్.. పైలెట్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీల దోస్త్.. పైలెట్..!
– ఎన్నికల్లో రోహిత్ రెడ్డి ను ఆశీర్వదించండి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్
– యాలాల మండలంలో జోరుగా ప్రచారం
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీల పట్ల ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి స్నేహపూరిత స్వభావం ఉందని, ఎన్నికల్లో అయన గెలుపుకు అందరు సహకరించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని బీఆర్ఎస్ తరుపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోసం బీసీ సంఘం తోడ్పాటు అందిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో యాలాల మండలంలోని హాజీపూర్, కిష్టాపూర్, లక్ష్మీనారాయణపూర్ గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు.

కందుకూరి రాజ్ కుమార్‌తో పాటు సంఘం నాయకులు బీఆర్ఎస్ తరుపున బీసీల అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కరపత్రాలను పంపిణీ చేశారు. బీసీ సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తున్న రోహిత్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్యే చేయాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా బీసీ సమీకృత భవన నిర్మాణానికి కృషి చేశారని గుర్తుచేశారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకుర్, కిష్టాపూర్ సర్పంచ్ ప్రవీణ్, అంజలయ, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, బషీరాబాద్ మండల అధ్యక్షులు నరేందర్, బీసీ యువ నాయకులు రాము ముదిరాజ్ హరి ప్రసాద్ వెంకట్ నవీన్ మరియు గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..