శాంతి.. సామరస్యం.. వెల్లి విరియాలి..!
– దసరా పండుగ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి
– తాండూరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గం, పట్టణ ప్రజలందరు విజయదశమి(దసరా) పండుగను ఆనందోత్సవాలతో జరుపుకోవాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. గురువారం ఆమె ప్రజలందరికి దసరా పండగ శుభాకాంక్షలను తెలిపారు. అదేవిధంగా తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు కూడ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఆత్మీయులందరితో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగే విజయదశమి అని అన్నారు. దసరా పండగను వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ఈ పండుగ ద్వారా ప్రజలందరి జీవితాల్లో శాంతి, సామరస్యం వెల్లివిరిసి, శ్రేయస్సును కలగజేయాలని ఆకాంక్షించారు.

