కౌంటింగ్‌కు కట్టుదిట్టంగా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కౌంటింగ్‌కు కట్టుదిట్టంగా..!
– పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు
– నిబందనలపై సిబ్బందికి అవగాహన
– ఎంపీ అభ్యర్థులూ.. ఎజెంట్ల వివరాలివ్వాలి
– తాండూరు సహాయ రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల కౌటింగ్‌కు కట్టుదిట్టమైన చర్యలతో సిద్దంగా ఉండాలని తాండూరు సహాయ ఎన్నికల అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు సూచించారు. బుధవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సిబ్బందికి కౌటింగ్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివసా్ రావు మాట్లాడుతూ లోక్‌ సభ ఎన్నికల కౌంటింగ్ – 2024 కు ఎన్నికల సిబ్బంది అందరూ సిద్ధంగా ఉండాలన్నారు.

కౌటింగ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ చేపట్టాలని సూచించారు. జూన్ 4 నాడు ఉదయం 5 గంటలలోగా కౌంటింగ్ సిబ్బంది చేవెళ్లలోని కౌంటింగ్ కేంద్రానికి (బాసిత్‌ కాలేజ్‌) చేరుకోవాలని ఆదేశించారు.

మరోవైపు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న 43 మంది అభ్యర్థులు అందరూ 56 తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు గురువారం సాయంత్రం 5.00 గంటలలోగా సమర్పించాలని సూచించారు. ఏజెంట్ల వివరాలు పోలీస్ శాఖకు అందజేస్తే ఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు మునిరుద్దీన్, కిషన్, వెంకటేష్, మాస్టర్ ట్రైనర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఓరీ.. పాపాత్ముల్లారా..!