
ప్రధానోపాధ్యాయులకు స్థాన చలనం
– ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ
– వివరాలు వెల్లడించిన తాండూరు ఎంఈఓ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు స్థానచలనం కలిగింది. పలువురు హెచ్ఎంలను బదిలీ చేసినట్లు మంగళవారం విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ తెలిపారు.
చిట్టిగణాపూర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కిష్యప్ప చెంగోల్ పాఠశాలకు, మల్కాపూర్ హెచ్ఎం నాగప్ప జినుగుర్తి ప్రాథమిక పాఠశాలకు, కరణ్ కోట్ పాఠశాల హెచ్ఎం నర్సిరెడ్డి చిట్టిగణాపూర్ కు, అంతారం హెచ్ఎం శ్రీలత గోనూర్ పాఠశాలకు, ఉద్దండాపూర్ రవీందర్ కుమార్ శర్మ సంగెంకలాన్ పాఠశాలకు, గోనూర్ హెచ్ఎం ఈశ్వరమ్మ ఉద్దండాపూర్ పాఠశాలకు బదిలీ అయినట్లు వెల్లడించారు. సుమారు పదేళ్ల తరువాత ప్రధానోపాధ్యాయులకు స్థాన చలనం కలిగినట్లు ఎంఈఓ వెంకటయ్య గౌడ్ తెలిపారు.

ఇదికూడా చదవండి…

