విద్యుత్ షాక్‌తో మేక మృత్యువాత

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrవిద్యుత్ షాక్‌తో మేక మృత్యువాత
– అంతారం తండాలో ఘటన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : విద్యుత్ షాక్‌ తగిలి ఓ మేక మృత్యువాత పడింది. ఈ సంఘటన తాండూరు మండలం అంతారం తాండాలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండాకు చెందిన మోతి బాయి కుంటుభీకులకు కొన్ని మేకలు ఉన్నాయి. ప్రతి రోజూ ఈ మేకలను మేపేందుకు బయటకు తీసుకెళుతుంటారు.

బుధవారం మోతిబాయి తన మేకలను తాండా సమీపంలోని బైపాస్ రోడ్డు మార్గం వైపు తీసుకెళ్లింది. అక్కడ ఉన్న ఓ ట్రాన్స్‌ ఫార్మర్ వద్దకు వెళ్లిన ఓ మేక విద్యుత్‌ షాక్‌కు గురై పడిపోయింది. దగ్గరకు వెళ్లి చూడగా మేక మృతి చెందింది. దీంతో మోతిబాయి, కుటుంభీకులు రోధించారు. మృతి చెందిన మేక రూ. 10వేల విలువ ఉంటుందని ఆవేధన వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

పట్టణాభివృద్ధికి సహకరించండి