ఆదర్శప్రాయుడు శివాజీ మహారాజ్
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– పట్టణంలోని సాయిపూర్ లో విగ్రహావిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత సంస్కృతి పరిరక్షణలో చత్రపతి శివాజీ మహారాజ్ అందరికి ఆదర్శప్రాయుడుగా నిలిచారని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం శివాజీ మహారాజ్ 393వ జయంతి ఉత్సవాలలో భాగంగా తాండూరు పట్టణం సాయిపూర్ 9వ వార్డు వీర శివాజీ నగర్ లో శివాజీ విగ్రహా ఆవిష్క ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీల పట్ల గౌరవం, పరమత సహనం చాటిచెప్పిన మహానీయుడు శివాజీ అని అభివర్ణించారు. మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి భారత దేశాన్ని హిందూ రాష్ట్రంగా నిలబెట్టిన యోధుడని అన్నారు. అందరికి ఆదర్శంగా నిలిచిన శివాజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, నాయకులు పట్లోళ్ల నర్సింలు, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

