రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి
– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్
– తాండూరులో దిష్టిబొమ్మ దహనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వాఖ్యలు చేసిన కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సోమవారం పార్లమెంట్ సమావేశంలో రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా, మనోభావాలు దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, మహిళ మోర్చ నాయకురాలు అంతారం లలిత, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం తదితరులు హాజరై రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువుల ఆచారా వ్యవహరాలపై, దేవుళ్లపై ఉన్న నమ్మకాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా వ్యాఖ్యలు చేయడం పట్ల మండిపడ్డారు. ఖబడ్దార్ రాహుల్ గాంధీ అంటూ హెచ్చరించారు.
హిందువులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో ఉంటూ వాఖ్యలు చేయడం సరికాదన్నారు. క్షమాపణలు చెప్పకుంటే రాహుల్ గాంధీని బహిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పూజారి పాండు, అసెంబ్లీ కన్వినర్ రజనీకాంత్, దోమ కృష్ణ, బొప్పి శ్రీహరి, అంతారం కిరణ్, జగదీష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

