ఆదర్శవంతమైన సేవలందించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆదర్శవంతమైన సేవలందించాలి
– చిన్నారులు, మహిళల ఆరోగ్యంపై దృష్టి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– పట్టణంలో అంగన్ వాడి కేంద్రం ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అంగన్ వాడి కేంద్రంలో ఆదర్శవంతమైన సేవలను అందించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణం 20వ వార్డులో ఏర్పాటు చేసిన అంగన్ వాడి కేంద్రాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ లతో కలిసి ప్రారంభించారు.
chai jr
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్ వాడి కేంద్రాల నిర్వహణపై దృష్టిసారించిందన్నారు. అంగన్ వాడి కేంద్రాలలో చిన్నారులకు చదువు ఆరోగ్యంపై పారదర్శకంగా సేవలను అందించాలన్నారు. గర్భిణీ, బాలింతలకు మెరుగైన సేవలను అందించాలన్నారు. చిత్తశుద్ధితో పనిచేసి ఆదర్శంగా నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, పట్లోళ్ల నీరబాల్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, నాయకులు అబ్దుల్ రవూఫ్, సంతోష్ గౌడ్, రాము, మైనార్టి నాయకులు జలాల్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి….

5న గోశాలలో ప్రత్యేక పూజలు