కాంగ్రెస్ గెలుపుకు సహకరించండి
– డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
– తాండూరులో మైనార్టీలతో సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం మైనార్టీల మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి ఆకాంక్షించారు. గురువారం తాండూరు పట్టణంలోని పలువురు మైనార్టీ పెద్దలతో మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ పెద్దలతో ముచ్చటించారు. కాంగ్రెస్ హాయాంలో మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించిందని గుర్తుచేశారు. ఈ సారి కూడా కాంగ్రెస్ ను ఆదరిస్తే మైనార్టీల సంక్షేమానికి అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ గెలుపుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమాల్లో పార్టీ సాయకులు డాక్టర్ సంపత్ కుమార్, అబ్దుల్ రవూఫ్, సాయిపూర్ బాల్ రెడ్డి, కౌన్సిలర్ అబ్దుల్ రజాక్, పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

