శభాష్.. స్మృతిక ..!
– సీమ్స్ ఒలంపీయాడ్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు
– రవీంద్ర భారతిలో అవార్డు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన చిన్నారి విద్యార్థి స్మృతిక అతి చిన్న వయస్సులోనే శభాష్ అనిపించుకుంది. నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలం జనగాం గ్రామ సర్పంచ్ రుక్మిణమ్మ మనుమరాలు, చెన్నారెడ్డి కూతురు స్మృతిక తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో చదువుతోంది. ఇటీవల నిర్వహించిన సీమ్స్ ఒలంపీయాడ్ పరీక్షల్లో స్ర్మీతిక సత్తా చాటింది.
రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకులో స్మృతిక ప్రతిభ కనబరిచింది. బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సీమ్స్ ఒలంపీయాడ్ సంస్థ ప్రతినిధులు స్మృతికను ఘనంగా సన్మానించారు. చిన్నారి స్మృతికను రూ. 40 వేల అవార్డును అందించి ప్రోత్సహించారు. మరోవైపు తమ చిన్నారి స్మృతిక సీమ్స్ ఒలంపీయాడ్‌లో మెరవడం పట్ల గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, స్కూల్ ప్రిన్సిపల్, యజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు.
ఇదికూడా చదవండి….

