లయన్స్ క్లబ్ గొల్డెన్‌ జూబ్లిలో నవతరం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jr
లయన్స్ క్లబ్ గొల్డెన్‌ జూబ్లిలో నవతరం..!
– తాండూరు అధ్యక్షులుగా రొంపల్లి సంతోష్ కుమార్ గుప్త
– ఈనెల 7న గోల్డెన్ జూబ్లీ ప్రమాణ స్వీకారోత్సవం
తాండూరు, దర్శిని ప్రతినిధి : లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూరు కార్యవర్గంలో నవతరం మొదలైంది. క్లబ్‌ గోల్డెన్ జూబ్లీలో కొత్త కార్యవర్గానికి యువతరం బాధ్యతలు చేపట్టబోతోంది. తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా రొంపల్లి సంతోష్ కుమార్ గుప్త ఎన్నికయ్యారు. లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ(2024-25) సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఇందులో భాగంగా అధ్యక్షులుగా రొంపల్లి సంతోష్ కుమార్ గుప్త, కార్యదర్శిగా గాజుల వరప్రసాద్, కోశాధికారిగా మహమ్మద్ అసద్ అలీ, ఉపాధ్యక్షులుగా మురళీ మోహన్, మల్లెపల్లి మధుసూదన్, మహమ్మద్ యూసూప్, కోఆర్డినేటర్ యెడ్రామి బసనప్ప, జాయింట్ సెక్రటరీ మల్లారెడ్డి తదితరులను ఎన్నుకున్నారు.

ఈనెల 7న ఆదివారం ఉదయం 11 గంటలకు పట్టణంలోని ఎంపీటీ హాల్లో గోల్డెన్ జూబ్లీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పాటు లయన్స్ క్లబ్ ఫాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ ఎన్.ఎన్. మూర్తి, రీజియన్ చైర్మన్ ఆశోక్ యాదవ్ లు పాల్గొంటున్నారని లయన్స్ క్లబ్ సభ్యులు తెలిపారు.

ఇదికూడా చదవండి….

జోహార్‌.. దొడ్డి కొమురయ్య..!