
మార్కెట్ కమిటి చైర్మన్‌గా బాల్ రెడ్డి
– వైస్ చైర్మన్‌గా ఎం. నర్సిరెడ్డి
– ఉత్తర్వులు జారీ చేసిన మార్కెట్ శాఖ
– పాలకవర్గ సభ్యులు ఖరారు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్‌గా కాంగ్రెస్ నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు మార్కెట్ కమిటి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సాయిపూర్ బాల్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా మదికొండ నర్సిరెడ్డి, సభ్యులుగా ఎండీ అజ్మత్ అలీ, కె.జర్నప్ప, రాథోడ్ తులసీ రాం, మహమ్మద్ ఖరీం, కోటం ఉదయ్ భాస్కర్ రెడ్డి, ఈడిగి నర్సింహ గౌడ్, ఉప్పరి మొగులయ్య, బిస్మీల్లా బీ, గొనెగారి శ్రీనివాస్, మేకల రాజు, సీహెచ్ బోజిరెడ్డి, ఎం. మాణిక్యం, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఏడీ, మున్సిపల్ చైర్ పర్సన్లను పేర్లను ప్రకటించారు. గత కొన్ని రోజులుగా మార్కెట్ కమిటి రిజర్వేషన్ విషయంలో ఉత్కంఠత ఏర్పడింది. మార్కెట్ కమిటి చైర్మన్ రిజర్వేషన్‌ను బీసీ జనరల్‌గా రిజర్వు చేసినట్లు ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. దీంతో మార్కెట్ కమిటి చైర్మన్ పీఠంపై ఉత్కంఠతకు తెరపడింది.
ఇదికూడా చదవండి…

