బీజేపీ జిల్లా కార్యవర్గంలో తాండూరు నేతలకు చోటు

తాండూరు రాజకీయం వికారాబాద్

బీజేపీ జిల్లా కార్యవర్గంలో తాండూరు నేతలకు చోటు
– జిల్లా ప్రధాన కార్యదర్శులుగా, ఉపాధ్యక్షులుగా స్థానం
– బీజేపీ జిల్లా అధ్యక్షుల ద్వారా నియామకపత్రాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) వికారాబాద్ జిల్లా కార్యవర్గం తాండూరుకు చెందిన ఆ పార్టీ నేతలు చోటు దక్కించుకున్నారు. జిల్లా కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శుల పదవులకు ఎంపికయ్యారు.
kvcs
తాండూరుకు చెందిన బీజేపీ నేతలు పటేల్ విజయ్ కుమార్, సుదర్శన్ గౌడ్, జుంటుపల్లి వెంకట్, బంటారం లావణ్య, పటేల్ సాయిరెడ్డిలు పార్టీలో కొనసాగుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్రరావు ఆదేశాల మేరకు వారికి కీలక పదువులను అప్పగించారు.

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పటేల్ విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులుగా సుదర్శన్ గౌడ్, పటేల్ సాయి రెడ్డి(మాజీ ఎంపీటీసీ), జిల్లా కార్యదర్శులుగా జుంటుపల్లి వెంకట్, బంటారం లావణ్య(మాజీ కౌన్సిలర్)ను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డా. రాజశేఖర్ రెడ్డి వారికి నియామకపత్రాలు అందజేశారు.

అనంతరం నియామకమైన నేతలు మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు పార్టీలో కీలక పదవులు దక్కించుకున్న వారికి నేతలు శుభకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

ఏడాది శుభ్రం కాని మురుగు కాలువ