పైలెట్ కోసం ప్రార్థనలు..!
– ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు
– ధన్యవాదాలు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోసం స్థానిక ముస్లిం సోదరులు ప్రార్థనలు చేశారు. ఇటీవల రోహిత్ రెడ్డి అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆసుపత్రి చికిత్స పొంది క్షేమంగా కోలుకుని తాండూరుకు వచ్చారు. శుక్రవారం పట్టణంలోని రోహిత్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు యూనుస్ ఆధ్వర్యంలో మత పెద్దలు రోహిత్ రెడ్డి క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అనంతరం రక్ష కట్టారు. తన కోసం ప్రార్థనలు చేయడం పట్ల రోహిత్ రెడ్డి ముస్లిం మత పెద్దలకు, సోదరులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, విజయ్ కుమార్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, మాజీ కౌన్సిలర్ సుమిత్ గౌడ్, వెంకట్ రెడ్డి, కుంచెం మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

