దుమ్ము గురించి ప‌ట్టదా..?

తాండూరు వికారాబాద్

దుమ్ము గురించి ప‌ట్టదా..?
– మేమేం పాపం చేశామంటూ ప్ర‌జ‌ల ఆవేధ‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరులో చెల‌రేగుతున్న దుమ్ము గురించి ఎవ‌రికి ప‌ట్ట‌దా అంటూ ప్ర‌జ‌లు వాపోతున్నారు. తాండూరు ప‌ట్ట‌ణంలోని ప్ర‌ధాన రోడ్ల ప‌రిస్థితి గురించి వివ‌రించాల్సిన అవ‌స‌రం లేదు. రోడ్ల‌పై వెద‌జ‌ల్లుతున్న దుమ్ము గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌తిరోజూ ప‌ట్ట‌ణంలోని శివాజీ చౌక్‌లోని ప్రాంత ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని ఆవేధ‌న వ్య‌క్తం చేస్తున్నారు. చౌర‌స్తా వ‌ద్ద వ్యాపారాలు నిర్వహించే వారు ఉద‌యం నుంచే దుమ్మునుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు రోడ్డుపై నీళ్లు చిమ్ముకుంటున్నారు. కొద్ది సేప‌టి త‌రువాత రాక‌పోక‌లు సాగించే వాహ‌నాల‌తో మ‌ళ్లీ చెలేరేగే దుమ్ముతో ఇక్క‌ట్ల‌ను ఎదుర్కొంటున్నారు. దీంతో మేమేం పాపం చేశామో.. దుమ్ము నుంచి శాపాన్ని మోస్తున్నామ‌ని, దుమ్ముగురించి ప‌ట్టించుకునే వారే లేరా అంటూ ఆవేధ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికైనా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ప్ర‌జా ప్ర‌తినిధులు స్పందించి దుమ్ము నుంచి శాశ్విత ప‌రిష్కారం చూపించాల‌ని మొర‌పెట్టుకుంటున్నారు.

https://youtu.be/0qCNmI1kRbM