పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
– మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్‌సింగ్ ఠాకూర్
– గాంధీనగర్లో శ్రమదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ అన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గురువారం గాంధీనగర్ లోని పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రం, కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతాల్లో కాలనీ మహిళలు, విద్యార్థులతో కలిసి శ్రమదానం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని పిచ్చి మొక్కలను తొలగింపు చేశారు. గోతులను పూడ్చివేయించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న డ్రైనేజీల వద్ద బ్లీచించ్ చల్లించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సంగీత ఠాకూర్ విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ మన ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిశుభ్రతను పాటించడంలో ఆదర్శంగా నిలవాలన్నారు. దీంతో పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యాలు మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటి చైర్మన్ లలిత, హెచ్ఎం నాగదేవి, టీచర్లు సరిత, జగదీశ్వరీ, అంగన్ వాడి టీచర్ రాధ, ఆశ వర్కర్ సుజాత, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఆరోగ్య సమాజాన్ని నిర్మించుకుందాం..!