శుభ్ర‌మైన శాంతిన‌గ‌ర్ పార్కు

తాండూరు వికారాబాద్

శుభ్ర‌మైన శాంతిన‌గ‌ర్ పార్కు
– ద‌ర్శిని క‌థ‌నానికి స్పంద‌న
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు మున్సిప‌ల్ అధికారులు స్పందించారు. ప‌ట్ట‌ణంలోని పార్కుల దుస్థితిపై ‘ఆహ్లాదం క‌రువైంది.. కంపే ఇంప‌య్యింది’ అనే క‌థ‌నానికి అధికారుల‌లో క‌ద‌లిక కనిపించింది. బుధ‌వారం ప‌ట్ట‌ణంలోని శాంతిన‌గ‌ర్ పార్కులో శానిట‌రి ఇనుస్పెక్ట‌ర్ శ్యాంసుంద‌ర్ ఆధ్వ‌ర్యంలో ప‌రిశుభ్ర‌త ప‌నులు చేప‌ట్టారు. పార్కులోని వాకింగ్ ట్రాక్ మార్గానికి మ‌రమ్మ‌త్తులు చేయించారు. పార్కులో పేరుకుపోయిన పిచ్చి మొక్క‌లు, గ‌డ్డిని జేసీబీ
యంత్రంతో తొల‌గించారు. ఆట వ‌స్తువ‌ల వ‌ద్ద ఉన్న మురుగు గుంత‌లో మ‌ట్టిని వేయించి చ‌దును చేయించారు. ఎట్ట‌కేల‌కు అధికారులు స్పందించి శ్ర‌మ‌దాన ప‌నుల‌తో పార్కును శుభ్రం చేయ‌డంపై స్థానికులు సంతోషం వ్య‌క్తం చేస్తూ అధికారుల‌ను అభినందించారు. ఈ ప‌నుల్లో శానిట‌రి ఇనుస్పెక్ట‌ర్ శ్యాంసుంద‌ర్‌తో పాటు జ‌వాన్ శ్రీ‌నివాస్, సిబ్బంది ఉన్నారు.