ఓపీఎస్ విధానాన్నే అమలు చేయాలి
– కార్మికులకు నష్టం కలిగే నిర్ణయాలను మానుకోవాలి
– రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన
– రైల్వే కార్మికుని రూ. 5వేల ఆర్థిక సాయం, ప్రతి నెల సాయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైల్వే కార్మికులకు పాత ఫించన్ విధానం అమలు చేయాలని రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం తాండూరు రైల్వే మజ్దూర్ యూనియన్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని రైల్వే స్టేషన్ లో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి యూనియన్ చైర్మన్ శ్యాం చౌహాన్(టీటీ), సేక్రటరీ కాళేశ్వర్, వైస్ చైర్మన్ అశోక్ గౌడ్, చంద్రశేఖర్ తదితరులు హాజరై మాట్లాడారు. కేంద్రం రైల్వే కార్మికులకు కొత్త ఫించన్ విధానం(ఎన్పీఎస్) అమలు చేసి పొట్ట కొట్టేందుకు యత్నిస్తుందన్నారు. ఈ విధానం అమలును రద్దు చేసుకుని పాత ఫించన్ విధానం(ఓపీఏస్)ను అమలు చేయాలన్నారు.
దీంతో పాటు కార్మికులకు నష్టం కలిగే నిర్ణయాలను విరమించుకోవాలన్నారు. కరోనా కాలంలో పనిచేసిన 18నెలల డీఏ వెంటనే మంజూరు చేయాలని, 8 గంటల నిర్థిష్ట పనిగంటలను అమలు చేయాలన్నారు. రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తి చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు పక్షవాతానికి గురైన ఇంటికి పరిమితమైన గ్యాంగ్ మెన్ మొగులప్పను యూనియన్ నాయకులు పరామర్శించారు. యూనియన్ తరుపున కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. దీంతో పాటు ప్రతి నెల రూ. 3వేల ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బాబులాల్, రిచర్డ్చన్, పీ. ప్రకాష్, నాగేందర్ బాబు, సురేష్, గన్నె రాజు, జీ. రమేష్, రాము, దేశ్ రాజ్, ఖయ్యూం పాష, లక్ష్మీనారాయణ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి..

