జుంటుపల్లికి భక్తుల తాకిడి..!
– సీతారాములను దర్శించుకున్న భక్తులు
– అన్నదానం చేసిన తాండూరు వాసి
తాండూరు, దర్శిని ప్రతినిధి : నియోజకవర్గంలోని యాలాల మండలం జుంటుపల్లికి భక్తుల తాకిడి పెరింగింది. శ్రావణమాసం శనివారం సందర్భంగా శ్రీ సీతారాముల దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. శ్రావణ శనివారం సందర్భంగా భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటి ఏర్పాట్లు చేసింది. వరుసలో నిలుచుని భక్తులు ఆలయంలో వెలసిన సీతారాములను దర్శించుకున్నారు. సల్లంగా చూడు రామయ్య స్వామి అంటూ సీతారాములను వేడుకున్నారు.
మరోవైపు తాండూరుకు చెందిన భక్తుడు బిచ్చాల మల్లయ్య కుమారుడు నితిన్ ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అలయ ధర్మకర్తలు, చైర్మన్, సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

