మంత్రి సబితారెడ్డి ఇంటా రక్షాబంధన్ శోభ
– సోదరుడు నర్సింహారెడ్డికి రాఖీ కట్టిన మంత్రి
– బాబు అన్న నివాసంలో పండగ సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి నివాసంలో రక్షాబంధన్ శోభ సంతరించుకుంది. గురువారం రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి సబితారెడ్డి తన సోదరుడు, స్వర్గీయ ఇంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మన్ నర్సింహారెడ్డి(బాబు)కు రాఖీ కట్టారు. మంత్రి సబితారెడ్డి స్వయంగా నర్సింహారెడ్డి నివాసానికి వెళ్లారు.

హిందూ సంప్రదాయం ప్రకారం సోదరుడు నర్సింహారెడ్డికి రక్షాబంధన్ కట్టారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగ శుభాకాంక్షలను తెలిపారు. రాఖీ పౌర్ణమి విశిష్టతను తెలుసుకుని పండగ విలువలను అందరిలో పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సింహారెడ్డి సతీమణి సుస్మితారెడ్డి, కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

