పేదలకు అన్నదానం అభినందనీయం
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– నజీర్ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదలకు అన్నదానం చేయడం ఎంతో అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గత రఏండ్లుగా ఆంబులెన్స్ డ్రైవర్ నజీర్ అన్నదానం చేస్తున్నారు. అన్నదాన సేవ ఆరేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై పేదలకు అన్నదానం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేదల ఆకలి తీర్చడం కోసం అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఆరేండ్లుగా అన్నదానం చేస్తున్న నజీర్ సేవను ఎమ్మెల్యే కొనియాడారు. సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఎంతో మంది ఆకలిని తీర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, చెన్నారం అనిల్ గుప్త, నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

