భారీ వర్షాలతో జాగ్రత్త..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

భారీ వర్షాలతో జాగ్రత్త..!
– బయటకు రావొద్దు.. రోడ్డెక్కొద్దు
– తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచన
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారీ వర్షాలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. తాండూరులో భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్‌ మండలాల్లోని వాగుల పరిస్థితిని ఆరా తీశారు. వాగుల ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

ఇండ్లలో నుంచి అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించారు. వాహనాలతో రోడ్లపైకి వచ్చి వాగులు, లోతట్తు ప్రాంతాలను దాటే ప్రయత్నాలు చేయొద్దన్నారు. ముఖ్యంగా ప్రజలు తమ ఇండ్లలోని చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బయటకు పంపరాదని, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ ఫోన్‌ చార్జీంగ్‌లకు దూరంగా ఉంచానలన్నారు. రేపు కూడా వర్షాలు కురిసే సూచన ఉందని, ప్రజలు ఇండ్లలోనే ఉండాలని సూచించారు.

ఇదికూడా చదవండి…

వర్షానికి కూలిన ఇండ్లు