తాగునీరు.. రోడ్డే ముఖ్యం
– ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : మా వార్డులో ఆ రెండు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు ప్రాధాన్యమివ్వాలని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని 24 వ వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత కోరారు. మంగళవారం గల్లి గల్లికి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌తో కలిసి వార్డులో పర్యటించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ సాహు శ్రీలత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో వార్డు సమస్యలపై విన్నవించారు. ముఖ్యంగా వార్డులో ఏండ్లుగా తాగునీటి సమస్య ఉందన్నారు. వార్డుకు వచ్చే రోడ్డు కూడ సక్రమంగా లేక వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ రెండు సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు.
