షభాష్‌ సమీనా ..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

షభాష్‌ సమీనా ..!
– ఉత్తమ ఉపాధ్యాయురాలుకు అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : షబాష్ సమీనా ఖాథూన్ అంటూ ఉపాధ్యాయులు, ఆమె కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు. తాండూరు పట్టణంకు చెందిన సమీనా ఖాథూన్‌ పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నెంబర్ 1లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సమీనా ఖాథూన్‌ను ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా బుధవారం తాండూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంఈఓ వెంకటయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానోత్సవంలో సమీనా ఖాథూన్‌ను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు సమీనా ఖాథూన్‌ను అభినందించారు. అదేవిధంగా ఆమె అన్న బీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు ఎండీ యూనుస్, బంధువులు షభానాభేగం, జమీల్, జహీదా భేగం, రష్మా అర్మాన్, అదిబా అర్మాన్, అయేషా అంజుమ్, రీజా అంజుమ్, బుష్రా, అక్సా, అఫ్సీన్, షహీన్, షఖీబ్, హీబా, తల్హాలు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

విద్యుత్ పిడుగు..!