అర్హులైన వారికి సబ్సీడిని అమలు చేయాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

అర్హులైన వారికి సబ్సీడిని అమలు చేయాలి
– ప్రజా పాలన దరఖాస్తుల పేరుతో ఇబ్బంది పెట్టొద్దు
– మున్సిపల్ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ సబ్సీడీసీ అమలు చేయాలని తాండూరు మున్సిపల్ గాంధీనగర్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. సోమవారం గాంధీనగర్ లోని డ్వాక్రా భవన్ లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ కింద గ్యాస్ సిలిండర్ రూ.500ల సబ్సీడీ లబ్దిదారులకు మున్సిపల్ ఆధ్వర్యంలో గుర్తింపు పత్రాల పంపిణీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ సంగీత ఠాకూర్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ లబ్దిదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సీడీని అమలు చేస్తున్నాయని తెలిపారు. అయితే కేంద్రం సబ్సీడీ అందజేస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యాస్ సిలిండర్ సబ్సీడీ కొంత మందికి అందడం లె దని తెలిపారు. అధికారులు సబ్సీడీ రాని లబ్దిదారులు మళ్లీ ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారని తెలిపారు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్న అర్హత పొందడం లేదని అన్నారు.

కావున కేంద్రం సబ్సీడీ అందజేస్తున్న లబ్దిదారులకు, అర్హులైన ప్రతి ఒక్కరికి మహాలక్ష్మీ గ్యాస్ సిలిండర్ సబ్సీడీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకోవాలంటూ లబ్దిదారులకు ఇబ్బందులకు గురిచేయొద్దని అన్నారు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి లబ్దిదారుకలు ఇబ్బందులు రాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఆర్పీలు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి….

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి