భద్రేశ్వర దేవాలయ కమిటికి గ్రీన్ సిగ్నల్
– నోటిఫికేషన్ జారి చేసిన దేవాదాయ శాఖ
– దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ప్రసిద్ధ భావిగి భద్రేశ్వర దేవాలయ పునర్ నిర్మాణ కమిటి ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కమిటి ఏర్పాటు కోసం హైదరాబాద్ దేవాదాయ శాఖ కమీషనర్ కార్యాలయం నుంచి నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉన్న దేవాలయాలకు సంబంధించి పునర్ నిర్మాణ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ చట్టం 1987 ప్రకారం నోటీఫికేషన్ జారీ చేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు తాండూరులోని భావిగి భద్రేశ్వర దేవాలయ పునర్ నిర్మాణ కమిటి కోసం నోటీఫికేషన్ జారీ చేసింది. చట్టం ప్రకారం ఫారం 11 ద్వారా కమిటి ఏర్పాటు కోసం దరఖాస్తులను కోరుతున్నట్లు వెల్లడించింది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. మరోవైపు తాండూరులోని భద్రేశ్వర దేవాలయంకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కావడం పట్ల ఆశావాహులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దేవాలయ చైర్మన్ గా పట్టణానికి చెందిన పటేల్ కిరణ్ కుమార్ పేరు ఖరారైట్లు ప్రచారం ఉంది.
ఇదికూడా చదవండి…

