పరవశించిన.. పీపుల్స్ కాలేజీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పరవశించిన.. పీపుల్స్ కాలేజీ..!
– ఉత్సహాంగా బతుకమ్మ సంబరాలు
– ఆడిపాడిన కళాశాల విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణం పరవశించిపోయింది. శనివారం కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఉత్సహాంగా జరుపుకున్నారు. బతుకమ్మ పండగ సందర్భంగా కళాశాల విద్యార్థులు అందమైన పూలతో అలంకరించిన బతుకమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులు సంస్కృతి, సంప్రదాయం ఉట్టేపడేలా బతుకమ్మ పాటలకు ఆడిపాడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చంద్రకళ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండగ ప్రతీకగా నిలుస్తోందన్నారు. పండగను అందరు సంతోషంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అద్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

నిరంతర సాధనతో ఏదైనా సాధ్యమే..!