మద్యం విషయంలో గొడవ..!
– ఎక్సైజ్ కానిస్టేబుల్, యువకుల మద్య ఘర్షణ
– కానిస్టేబుల్ కు గాయాలు, పోలీసులకు ఫిర్యాదు
– కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మద్యం విషయంలో ఎక్సైజ్ కానిస్టేబుల్, కొందరు యువకుల మద్య రగడ జరిగింది. ఈ క్రమంలో కానిస్టేబుల్ కు గాయాలు కావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎక్సైజ్ శాఖలో కృష్ణ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. పట్టణంలోని సాయిపూర్ లో నివాసం ఉంటున్నారు. అయితే బుధవారం రాత్రి ఇంటి సమీపంలో కిరాణా షాపుకు వెళుతుండగా మార్గంలో అదే ప్రాంతానికి చెందిన ఫజరల్, జగదీష్, మరో వ్యక్తి కలిసి మద్యం సేవిస్తున్నారు. దీనిపై కానిస్టేబుల్ కృష్ణ రోడ్లపై మద్యం తాగరాదని, న్యూసెన్స్ అవుతుందని వారించి ఇంటికి వెళ్లిపోయారు.
కొద్ది సేపటి తరువాత యువకులు కానిస్టేబుల్ ఇంటి వద్దకు వెళ్లి ఆయన వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. యువకుల ఘర్షణలో కానిస్టేబుల్ కృష్ణ ఎడమ కన్నుకు గాయాలయ్యాయి. దీంతో కానిస్టేబుల్ కృష్ణ గురువారం ఉదయం తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితుల పై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సంతోష్ కుమార్ వెల్లడించారు. మరోవైపు పలు సామాజిక మాధ్యమాలలో మద్యంతో కానిస్టేబుల్, యువకుల మద్య ఘర్షణ జరిగినట్లు పుకార్లు షికారు చేశాయి. కానిస్టేబులే దాడి చేశారని ఓ వర్గం, కాదు కానిస్టేబుల్ పైనే యువకులు దాడి చేశారంటూ ప్రచారం చేసుకున్నారు.
ఇదికూడా చదవండి…

