తాండూరులో షాడో రాజకీయాలు..!

తెలంగాణ

తాండూరులో షాడో రాజకీయాలు..!
– గాలికి గెలిచి వాపు వాఖ్యలు
– రోహిత్ రెడ్డిని విమర్శించే స్థాయి మీకు లేదు
– బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో షాడో రాజకీయాలు చేస్తుంది ఎవరో ప్రజలకు తెలుసని బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ యువనాయకులు పైలెట్ రోహిత్ రెడ్డిపై చేసిన వాఖ్యలను సందీప్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో ఖండించారు. తాండూరు నియోజకవర్గంలో ఎన్నటికీ కూడా ప్రజల్లో ఆదరణ తగ్గని ఏకైక నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డినే అని గర్వంగా చెబుతున్నట్లు తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లో వస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్‌ పైచేయి ఉంటుందని అన్నారు.

గాలిలో గెలిచిన కాంగ్రెస్ అభివృద్ధి గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే నవ్వులాటగా అనిపిస్తుందని విమర్శించారు. గాలి గెలుపును తమ గెలుపుగా మార్చుకోవడం మూర్ఖత్వం అన్నారు. తాండూరు నియోజకవర్గంలో రోహిత్ రెడ్డి హయాంలో చేపట్టిన చెక్ డాములు, రోడ్లు మీకు కనిపిస్త లేవా ప్రశ్నించారు. తాండూరు చుట్టపు చూపుగా ఎవరు వచ్చారో ప్రజలకు అందరికీ తెలుసు అన్నారు. తాండూరులో షాడో రాజకీయాలు చేస్తున్నదెవరో, ఎర్రమట్టి రవాణా ఎవరి కన్నుసన్నల్లో నడుస్తుందో అన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదని, మళ్లీ విమర్శులు చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

ప్రజా పాలనపై రాక్షస నిందలు..!