అభివధ్ధిపై పోకస్ పెట్టండి..!
– సీఎం నుంచి చైర్ పర్సన్‌కు సూచన
– రేవంత్ రెడ్డిని కలిసిన స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అభివృద్ధిపై ఫోకస్ పెట్టండని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌కు సూచించారు. విజయదశమి సందర్భంగా ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కోడంగల్‌లో నేతలను కలిసేందుకు వచ్చారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తో తాండూరు మున్సిపల్ అభివృద్ధిపై ఆరా తీశారు. పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు దృష్టిసారించాలని సూచించారు. ఇందుకు చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ధన్యవాదాలు తెలిపారు.
ఇదికూడా చదవండి…

