గ్రూప్-1 పై అనుకూల తీర్పు బాధాకరం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

గ్రూప్-1 పై అనుకూల తీర్పు బాధాకరం
– జీవో29తో అభ్యర్థులకు అన్యాయమే
– రేవంత్ సర్కారుపై తిరుగుబాటు తప్పదు
– జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రూప్-1 విషయంలో కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం బాధాకరమని వి కారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. సోమవారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన జీఓ 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అన్యాయం జరిగిందన్నారు. దీనిపై సుప్రీం కోర్టు ద్వారా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడం పట్ల బాధ వ్యక్తం చేశారు. జీఓ రద్దు కోసం ఉద్యమాలు చేస్తున్న విద్యార్థులకు ఈ వార్త ఎంతో బాధ కలిగిస్తుందన్నారు.

ఇంత అన్యాయమైన జీఓ తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కారుపై నిరుద్యోగుల తిరుగుబాటు తప్పదన్నారు. అదేవిధంగా ఆయా వర్గాల ప్రజలు కూడా ఉద్యమానికి సిద్దమవుతున్నారని అన్నారు. ఆయా వర్గాల ఉద్యోగులు, విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలసీ కూడా రేవంత్ రెడ్డి జీఓను తీసుకరావడం దుర్మార్గమన్నారు. ఓపెన్ క్యాటగిరిలో ఉన్న 50 శాతంలో వాటా అడగడం లేదని, ఆ వర్గాలను తీసుకెళ్లి రిజర్వేషన్ కోటాలో ఇవ్వడం ఎవ్వరైనా ఆమోదిస్తారా అని ప్రశ్నించారు.

ఈ ప్రభుత్వంలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎస్సీ, ఎసీ, మైనార్టీ నాయకులు ప్రశ్నించాల్సిన అవసరముందన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన సర్కారు దుర్మార్గమైన చర్యలకు పాల్పడడం సమంజసం కాదన్నారు. ఓ వైపు కేంద్రం ఈడబ్ల్యూఎస్ తో అన్యాయం చె స్తుంటే.. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి జీఓ 29ను తెచ్చి అన్యాయం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గౌరవం ఉంటే రాజ్యాంగా విరుద్ధంగా జీఓలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే భవిష్యత్తు తరాలకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనికి వ్యతిరేకంగా.. వర్గాలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామన్నారు.

ఇదికూడా చదవండి…

మనోహరన్న కృషితో మహర్దశ