సగ్గు బియ్యం.. సగం బలం..!
– మెదడును ఆరోగ్యంగా ఉంచె విటమిన్లు
– శరీర వేడిని తగ్గించే రసాయనాలు
దర్శిని డెస్క్ : ప్రకృతి నుంచి లభించే దాని నుంచి తయారు చేసే సహజ ఆహార పదార్థమే సగ్గు బియ్యం లేదా సబాదానా అని పిలుస్తారు. ఇది తాటి చెట్టు నుండి తీసిన రసాన్ని పిండి చేసి తయారు చేస్తారు. దీనిని తరచూ తీసుకుంటే శరీరానికి సగం బలం అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా దీని నుంచి అనేక ప్రయోజనాలు ఉన్నాయి, అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. సగ్గు బియ్యం, లేదా సబుదానా, అనేది అనేక భారతీయ వంటకాలలో ప్రధాన పదార్థం. సగ్గుబియ్యంలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ సమస్యలను తక్షణం సగ్గు బియ్యం నివారిస్తాయి.
సగ్గుబియ్యంలో ఉండే పొటాషియం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగి గుండె సంబంధింత వ్యాధులు దూరమవుతాయి. సగ్గుబియ్యంలోని విటమిన్ కె మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. సగ్గు బియ్యం శరీరంలో అధిక వేడి ఉన్నవారు సైతం సగ్గు బియ్యాన్ని జావగా కాసుకుని తీసుకోవటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారికి సగ్గు బియ్యం మంచి ఆహారం. సగ్గుబియ్యాన్ని రసాయనాలు లేని న్యాచురల్ స్వీటనర్‌గా చెప్పవచ్చు.
సహజంగా బరువు తగ్గించటానికి సగ్గు బియ్యం మంచి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. సగ్గు బియ్యంలో కొవ్వు పదార్దాలు చాలా తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు తరచుగా సగ్గుబియ్యం వాడటం వల్ల శరీరంలో కొవ్వు శాతం తగ్గించుకోవచ్చు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ ఇతర ముఖ్యమైన విటమిన్లను అందిస్తుంది.
అంతేకాదు.. సగ్గుబియ్యంతో ఆహారం క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల ఇది మీ చర్మాన్ని మెరుగుపరచడానికి ముడతలు ఏర్పడకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. సగ్గు బియ్యం ఫైబర్‌కు మంచి మూలం, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్దకాన్ని నివారిస్తుంది. ఇది శరీరానికి త్వరిత శక్తిని అందిస్తుంది, ముఖ్యంగా వ్యాధి లేదా వ్యాయామం తర్వాత. సగ్గు బియ్యం నీటిని బాగా గ్రహిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.
ఇదికూడా చదవండి…

