ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం
– డీఎస్సీ, మెడికల్ కౌన్సిలింగ్లో అభ్యర్థులకు నష్టం
– సీఎం రేవంత్ రెడ్డి కోటా అమలును సవరించాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన 49.5 శాతం నుంచి ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కేటాయించడంతో బీ సీలకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేధన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ లో కోటాను ఖరారు చేయకుండా రిజర్వేషన్లను అమలు చేయడంతో డీఎస్సీ, మెడికల్ కౌన్సిలింగ్ సీట్లలో బీసీ అభ్యర్థులకు నష్టం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో 4శాతం లేని ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారరు.
కేంద్రం నిర్ణయాన్ని చాలా రాష్ట్రా లు అమలు చె యడం లేదని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 100 శాతం ఉద్యోగాలలో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు పోగా మిగిలిన 50శాతంలో ఆప్ టు టెన్ పర్సెంట్ ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అనాలోచితంగా ఉండడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజ్వేషన్లనుంచి 10 శాతం తీసేయడంతో వారు నష్టపోతున్నారని అన్నారు. ఇటీవల జరిగిన యూనివర్సీటీ అడ్మిషన్లలో మెడికల్, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లలో డీఎస్సీలో బీసీ అభ్యర్థులకు 70.30 కట్ ఆఫ్ మార్కులు ఉంటే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 61.87 కట్ మార్కులతో ఉద్యోగాలు పొందారని అన్నారు. దీనివల్ల బీసీ విద్యార్థులు అన్యాయం జరిగిందన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రిజర్వేషన్ల కోటాను సవమించాలని డిమాండ్ చేశారు.
ఇదికూడా చదవండి…

