ఉర్దూ మీడియం పోస్టులను భర్తి చేయించండి
– చీఫ్ విప్ మహేందర్ రెడ్డికి నిరుద్యోగ ఉపాధ్యాయ సంఘం వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తి చేసేలా చొరవ చూపాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డిని ఉర్దూ మీడియం నిరుద్యోగ ఉపాధ్యాయ సంఘం సభ్యులు కోరారు. ఆదివారం తాండూరులోని నివాసంలో చీఫ్ విప్ మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు గత 20 ఏండ్లుగా రాష్ట్రంలో 666 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మహేందర్ రెడ్డికి వివరించారు.
పోస్టుల భర్తీలో గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. విద్యాభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. కావున ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి డీఎస్సీ ద్వారా ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే విధంగా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు చీఫ్ విప్ మహేందర్ రెడ్డి స్పందిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఉండి ఉర్దూ మీడియం పోస్టులను భర్తి చేయించడం జరిగిందన్నారు.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి.. ప్రభుత్వ సలహా దారు వేం నరేందర్ రెడ్డితో చర్చించి పోస్టుల భర్తికి కృసి చేస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అబ్దుల్ ఖవి, నిరుద్యోగ ఉర్దూ మీడియం ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఖాజా పాష, అబ్దుల్ నాసర్, అబ్రహం, రేహాన్, అస్లాం తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

