వైన్‌ షాపులో పడ్డ దొంగ..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

వైన్‌ షాపులో పడ్డ దొంగ..!
– రూ. 5వేలు విలువైన్ మద్యం బాటిళ్ల చోరీ
– సుమారు రూ. 5వేల నగదు అపహరణ
– పెద్దేముల్ మండల కేంద్రంలో ఘటన
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పండగ పూట సమయాన్ని చూసి గుర్తుతెలియని దుండగుడు వైన్స్‌ షాపులో దొంగతనానికి పాల్పడ్డాడు. షాపులో బీరు బాటిళ్లతో పాటు నగదును అపహరించుకుపోయాడు. ఈ సంఘటన శనివారం పెద్దేముల్ మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. షాపు నిర్వహకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని శ్రీ కనకదుర్గ వైన్స్ షాపును రాజు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి వ్యాపారం పూర్తయిన తరువాత షాపుకు తాళం వేసుకుని వెళ్లిపోయాడు. అర్దరాత్రి దాటిన తరువాత షాపు వెనుక భాగంలో ఉన్న కీటికి ఇనుప కడ్డీలు తొలగించి గుర్తుతెలియని వ్యక్తి లోపలికి ప్రవేశించాడు. కౌంటర్‌ లో ఉన్న సుమారు రూ. 5వేల నగదును దొంగలించి.. అనంతరం షాపులో ఉన్న మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. వీటి విలువ సుమారు రూ. 5వేలు ఉండొచ్చని నిర్వహకులు తెలిపారు. ఈ చోరీ సంఘటన సీసీ రికార్డు అయ్యింది. ఈ చోరీపై పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపాడు.

ఇదికూడా చదవండి…

ఎమ్మెల్యే కృషితోనే రోడ్ల అభివృద్ధి