పట్టణ అభివృద్ధికి నిరంతర కృషి

తాండూరు రాజకీయం వికారాబాద్

పట్టణ అభివృద్ధికి నిరంతర కృషి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌
– వార్డుల్లో మురుగు కాలువల పనులు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని 17, 18వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న మురుగు కాలువల నిర్మాణ పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డులో మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుందన్నారు.

దీని వల్ల ప్రజలకు మురుగు నీరు ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. దీంతోపాటు మౌళిక వసతుల కల్పన, సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో వార్డులను అభివృద్ధి పరిచి తాండూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్‌ విక్రమ్ సింహారెడ్డి, కౌన్సిలర్ అఫ్రీన్ జవేరీయా, అన్వర్ ఖాన్, నవీద్ ఖాన్, మియాబీ, తౌఫిక్ అహమ్మద్, ఖైసర్, జఫ్పార్, ముజ్జు, మోయిజ్ ఖాన్, సయ్యద్ నవాబ్, సయ్యద్ హబీబ్, మతీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పేకాట స్థావరాలపై ఉక్కుపాదం..!