ఎమ్మెల్యే సహాకారంతో సమస్యల పరిష్కారం
– మాజీ కౌన్సిలర్ బోయ రవిరాజు
– ఇందిరానగర్ లో ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహాకారంతో పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం అవుతున్నాయని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బోయ రవిరాజు అన్నారు. శనివారం పట్టణంలోని ఇందిరానగర్ 6వ వార్డు హమాలి బస్తీలో 160 కెవి కొత్త విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేశారు. ఈ పనులు వార్డు మాజీ కౌన్సిలర్ బోయ రవిరాజు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో వార్డులో సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే చొరవతో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా త్వరలో వార్డులో మురుగు కాలువలు, సీసీ రోడ్ల అభివృద్ధి చేపట్టడం జరుగుతుందని అన్నారు. అడిగిన వెంటనే సమస్యల పరిష్కారానికి సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదికూడా చదవండి…