సర్వే ఫార్మెట్‌లు వచ్చేశాయ్…!
– ఎన్యూరేటర్లకు పత్రాల అందజేత
– సర్వే సవ్యంగా పూర్తి చేయండి
– మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటింటి కుల గణనలో భాగంగా సర్వేకు సంబంధించిన ఫార్మెట్ పత్రాలు మున్సిపల్‌కు చేరుకున్నాయి. సర్వే ప్రశ్నావళిలో పలు ప్రశ్నల మార్పుల కారణంగా ఫార్మెట్ పత్రాలు అందలేదు. దీంతో సర్వే మొదటి దశ కింద ఇంటింటికి స్టిక్కర్ల పంపిణీ చేపట్టారు. తాండూరు మున్సిపల్ పరిధిలో దాదాపు ఇంటింటికి స్టిక్కర్ల పంపిణీ పూర్తయ్యింది. శుక్రవారం రాత్రి ఫార్మెట్ పత్రాలు అందుబాటులోకి రావడంతో శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లకు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి సమక్షంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, అధికారులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశించిన విధంగా అందరు ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా సర్వే సవ్యంగా పూర్తి చేయాలన్నారు. ఇంటి యజమానులతో మర్యాదగా మెలిగి కుటుంబ వివరాలను నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. మరోవైపు ఫార్మెట్ పత్రాలు అందుకున్న సిబ్బంది సర్వేకు బయల్దేరారు. ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తుండడంతో సర్వే వేగం పుంజుకుంది.
ఇదికూడా చదవండి…

