వార్డు సమస్యల పరిష్కారానికి కృషి
– 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్
– రూ. 5లక్షలతో సైడ్ డ్రైన్ పనుల ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. సోమవారం వార్డులో రూ. 5లక్షలతో చేపడుతున్న సైడ్ డ్రైన్ నిర్మాణ పనులను కౌన్సిలర్ సంగీత ఠాకూర్ వార్డు ప్రజలతో కలిసి ప్రారంభించారు. వార్డులో రోడ్లు ఎత్తుగా ఉండడంతో సరైన విధంగా సైడ్ డ్రైన్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాజాగా వార్డులో సైడ్ డ్రైన్ పనులు చేపట్టడం వల్ల మురుగు కష్టాలు తీరుతున్నాయ్నారు. వార్డులో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కమలమ్మ, పద్మ, రేణుక, స్వరూప, వెంకటప్ప, నారాయణ, భద్రణ, అంగన్ వాడి టీచర్ రాధ, వార్డు ఆఫీసర్ రాములు, ఆర్పీలు శోభ, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

